top of page

ఇకపై టీఎస్‌ కాదు; టీజీ.. వాహనాల రిజిస్ట్రేషన్‌లో మార్పునకు చట్టం🗣️🤔

తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.

తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చేలా ఉన్నదని, రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు చెప్పారు. కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలను తీసుకొని తుది రూపు ఇస్తామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వారు, అనేకసార్లు జైలుకు వెళ్లిన వారికి తెలంగాణ చిహ్నంలో స్థానం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటివరకు 14.25 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారని వెల్లడించారు. త్వరలో తాము అమలుచేయబోమే మరో రెండు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని చెప్పారు.🗣️🤔

bottom of page