🔵 మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీకి పెట్టింది పేరు.. గతంలో ఇందిరాగాంధీ ఇక్కడి నుండే ఎంపీగా పోటీ చేసి గెలిచి దేశ ప్రధాని కూడా అయ్యారు. 🎯
అలాంటి చోట పార్టీ ఎలా ఉండాలి…! వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండాలి.. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 🔄 మెదక్ నియోజకవర్గ పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి అసలు పొసగడం లేదని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. 🧐
🔵 అదే రోజు జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రామయంపేట డివిజన్ ఏర్పాటు కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. 🔴 మొన్నటికి మొన్న మెదక్ కు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మ్యాడం బాలకృష్ణ మెదక్ బంద్ కు పిలుపునిస్తే.. ఈ కార్యక్రమంకు మాకు ఏలాంటి సంబంధం లేదు అని జిల్లా అధ్యక్షుడు వర్గం చెప్పేసారు. 🤔