top of page

🎭 కాంగ్రెస్‌ ట్విస్ట్‌కు ఖంగుతిన్న సీపీఎం.. ఆ ఒక్క సీటు చుట్టూ తిరుగుతున్న పొత్తుల వ్యవహారం 🤨

🏛️ సీపీఎం, కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత నెలకొంది. 🤔 ఇన్నాళ్లు పొత్తుల పై దోబూచులాట నడిచింది. 👥 ఇపుడు వైరా సీటు పై కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్ట్ కు సీపీఎంను గందర గోళంలో పడేసింది. 🌪️

భద్రాచలం, పాలేరు మీద ఆశలు పెట్టుకున్న సీపీఎంకు, మొదటే షాక్ ఇచ్చింది. 👀 కానీ తమకు బలమున్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వక పోతే పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. 💪 కేంద్ర స్థాయిలో చర్చలు, రాష్ట్ర స్థాయిలో చర్చల్లో.. 👥 జిల్లాలో వైరా సీటు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు సీపీఎం నేతలు చెబుతున్నారు. 🗣️ వైరా సీటు ఖరారు అయ్యిందని, తమ అభ్యర్థిని పోటీకి సిద్దం చేస్తున్న సమయంలో.. 🎭 కాంగ్రెస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 🔄 మిర్యాల గూడతో పాటు హైదరాబాద్‌లో ఒక సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టడం, వైరా సీటు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పడంతో సీపీఎం నేతలు ఖంగు తిన్నారు. 🤯

🗺️ భద్రాచలం సిట్టింగ్ స్థానం వదులు కోమని, తన అభ్యర్థి పోడెం వీరయ్యను ప్రకటించారు. 📢 రెండవ ఆప్షన్ పాలేరులో ఆశలు పెట్టుకున్న సీపీఎం పార్టీకి ఆఖరి నిమిషం లో షాక్ ఇచ్చింది. ⏰ కాంగ్రెస్ తన అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించింది. 📣 ఈ రెండు సీట్లు చేజారి పోవడంతో.. 🗳️ పొత్తులపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. 🌟 కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని, తమకు బలమున్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటైనా ఖచ్చితంగా ఇవ్వాలని సీపీఎం పట్టు పట్టింది. 💼 వైరా సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టడంతో సీపీఎం అంగీకరించింది. 📜 పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు, వీటిలో వైరా సీటు కూడా ఉంది. 📄🗳️

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page