top of page

"కాంగ్రెస్‌తో కమ్యూనిస్ట్‌ల పొత్తుపై స్పందించిన కోమటిరెడ్డి🤝

కాంగ్రెస్ – లెఫ్ట్ నేతల పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 🗳️ సీట్ల సర్థుబాటు విషయంలో కీలక వ్యాక్యలు చేశారు. 🗣️

లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదన్నారు. 🤷‍♂️ నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని జోస్యం చెప్పారు. 🏆 హంగ్ అసెంబ్లీ వస్తే అది కాంగ్రెస్‌కి నష్టమవుతుందన్నారు. 🏛️ కాంగ్రెస్ పార్టీ గెలిచాక రెండు ఎమ్మెల్సీ పదవులతో పాటూ, మరో రెండు మంత్రి పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. 🤔 దీనిపై కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 👀 కాంగ్రెస్ ఇప్పటి వరకూ విడుదల చేసిన రెండు జాబితాల్లో సీపీఐ, సీపీఎం నాయకుల పేర్లు ఉంటాయని చూసినప్పటికీ తీవ్ర నిరాశే ఎదురైంది. 😞 గతంలో కమ్యూనిస్ట్ నేతల మధ్యే విభిన్న స్వరాలు వినిపించాయి. 🗣️ వైరా నియోజకవర్గంలో కమ్యూనిస్ట్‌ నాయకుడిని పోటీ నుంచి తప్పుకోవాలని ట్రేడ్ యూనియన్ సభ్యులు బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ✍️ ఇప్పుడు ఇలా జరగడంపై తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్ళడం కానీ లేదా అన్నది వేచి చూడాలి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page