🗳️ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ అవగాహన 📚 కుదిరినా.. సీట్ల అంశం తేలలేదంటూ అటు కాంగ్రెస్ ఇటు వామపక్ష నేతలు 🗣️ చెప్పుకుంటూ వచ్చారు.
🔵 ప్రస్తుతం అది కూడా కొలిక్కి రావడంతోటి ఇక అధికారిక ప్రకటన 📢 తరువాయి అంటున్నారు.🚩 వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోనే ప్రాబల్యం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచే సీట్లు ఇవ్వాలని పట్టు పట్టడం.. 🏠 ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హౌస్‌ఫుల్ కావడంతో సీట్ల పంచాయతీ ఇంతకాలం సాగుతూ వచ్చింది.🤝 సిపిఐ, సిపిఎం కోరిన స్థానాల్లో ఒక సీటు వాళ్ళు అడిగినది మరొక సీటు కాంగ్రెస్ అనుకున్నది ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది.👥 ఆ మేరకే సిపిఐ అడిగినదాంట్లో కొత్తగూడెం దానికి తోడుగా చెన్నూరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముగ్గు చూపింది.📜 సిపిఎంకి సంబంధించి మిర్యాలగూడతో పాటు పాలేరు కావాలని పట్టుబట్టగా పాలేరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఖమ్మం జిల్లాలోనే వైరా సీటును కేటాయిస్తామని స్పష్టం చేసింది. 🌆 ఈ ప్రతిపాదనలకు వామ పక్షాలు సైతం మౌఖికంగా సరే అన్నాయి.🗳️ మునుగోడు సీటు తమకు కేటాయించాల్సిందేనని సిపిఐ నల్గొండ నేతలు పట్టుబట్టారు.📍 మునుగోడు లేకుండా పొత్తు ప్రస్తావనే వద్దన్న నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారాయి.🤝 అయితే మునుగోడుపై భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని అధిష్టాన నిర్ణయానికి ఫైనల్ గా నేతలంతా కట్టుబడి ఉండాల్సిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.🌇 మునుగోడు కాంగ్రెస్ సీటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తామంటేనే ఆయన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందుతుంది.🔄 ఈ నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్సే బరిలో ఉంటుందని సిపిఐకి గతంలో కేటాయించిన సీట్లనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. 🗳️🏛