📚 తెలంగాణలోని సిద్ధాంతులు, పండితులంతా కలిసి ఒక విద్వత్సవ ఫోరం పెట్టుకున్నామని పండితులు చెబుతున్నారు.
తాము హిందువుల పండగలు జరుపుకునే విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి తేదీ కూడా సెప్టెంబర్ 18 అని నివేదిక ఇచ్చామని. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించిందని పేర్కొన్నారు.
🎉 అయితే భాగ్యనగర ఉత్సవ సమితి మాత్రం వినాయక చవితిని 19వ తేదీన జరపాలని భక్తులను కోరుతుంది. చవితి 18వ తేదీ మధ్యాహ్నం 1:00కు ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1:00కు ముగుస్తుంది. అయితే తిధి ఏ రోజైతే సూర్యోదయం ఉంటుందో ఆ రోజునే పండుగ రోజుగా గుర్తించే సాంప్రదాయం మన తెలుగు వాళ్ళకు ఆనాదిగా వస్తుందని భాగ్యనగర ఉత్సవ సమితి చెబుతుంది. కనుక సూర్యోదయం ఉన్న 19వ తేదీన వినాయక చవితి పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించాలని ఉత్సవ సమితి కోరుతుంది. అయితే 18వ తేదీన చేసుకుంటామనే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కూడా వారు చెబుతున్నారు.