🤝👥 పొత్తులపై కాంగ్రెస్, వామపక్షాల చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించింది. 📣📢
రెండో విడత త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 🕒📆 కాగా ఖమ్మం జిల్లాలో సీపీఐకు కొత్తగూడెం.. ఖరారు అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. 📰🗞️ సిపిఎంకు ఏ సీటు ఇస్తారనే దానిపై రోజుకో విధంగా ప్రచారం జరుగుతోంది. 🎙️📣 పాలేరు, భద్రాచలం కావాలని సిపిఎం పట్టుబడుతోంది. 🏛️🗳️ కానీ భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు మళ్ళీ టికెట్ ప్రకటించారు. 🗳️🏛️ సిట్టింగ్ సీటు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది..
🏛️🗳️ మరో సీటు పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుకున్నప్పటికీ.. మారిన సమీకరణాలు నేపథ్యంలో.. 🤔📊 ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది. 🗳️🏛️ పాలేరు కూడా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. 🚫🗳️ తాజాగా వైరా సీటు సిపిఎంకు ఇస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. 📢📆 ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా పొత్తు కుదరదని సిపిఎం స్పష్టం చేస్తోంది. 📝🏛️ వైరా నియోజకవర్గంలో సిపిఎం పార్టీ 25 వేల ఓట్లు కలిగి ఉందని, 📊🗳️ వైరా సీటు దక్కించుకోవాలని.. 🤞🏛️ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సమావేశాల్లో 🗣️📊 చర్చలు జరిగాయి. ఈమేరకు సిపిఎం జాతీయ నాయకులకు నివేదిక పంపించినట్లు పార్టీ వర్గాల్లో 🗣️📢 చర్చలు జరుగుతున్నాయి. 🤝👥🗳️