top of page
Suresh D

ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌.. 😤

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించండి అని సవాల్‌ విసిరిన రేవంత్‌.. కేసీఆర్‌ వస్తారో, కేటీఆర్‌ వస్తారో చూద్దామన్నారు. తాను నాన్న పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్న రేవంత్‌ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానని చెప్పుకొచ్చారు. రెండు నెలల్లోనే హామీలు అమలు దిశగా వెళ్తున్నాని చెప్పుకొచ్చారు...


చేవేళ్ల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. బీఆర్ఎస్‌కు దమ్ముంటే పార్లమెంట్‌లో ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం కూలిపోతుందని ఎవరన్నా అంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు చెట్టుకు కట్టి కొడతారని హెచ్చరించారు. 😠

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించండి అని సవాల్‌ విసిరిన రేవంత్‌.. కేసీఆర్‌ వస్తారో, కేటీఆర్‌ వస్తారో చూద్దామన్నారు. తాను నాన్న పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్న రేవంత్‌ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానని చెప్పుకొచ్చారు. రెండు నెలల్లోనే హామీలు అమలు దిశగా వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. తాము హామీలు అమలు చేస్తుంటే BRS కడుపు మండుతోందని రేవంత్ యద్ధేవ చేశారు. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందని సీఎం రేవంత్‌ చెప్పుకొచ్చారు. 😡

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కులపెద్ద మోదీనే అని కామెంట్ చేశారు. గుజరాత్ మోడల్‌లో అభివృద్ధి లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా దాడులు చేయించి ప్రభుత్వాలను కూలదోయడమే గుజరాత్ మోడల్ అని ఆరోపించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు ఇబ్బందిపడకుండా రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకం అందనివాళ్లు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కార్డుతో అధికారులను సంప్రదించాలని సూచించారు. 😠

Comentarios


bottom of page