top of page

మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..👩‍💼

పార్లమెంట్ ఎన్నికల వేళ.. ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్​గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసిన సర్కార్.. ఎన్నికల ముందే మరో రెండు పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

స్వయం సహాయక సంఘాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పునరుజ్జీవం పోయాలని నిర్ణయించారు. విద్యార్థులు, పోలీసులకు ఇచ్చే యూనిఫాంలను కుట్టించే పని వారికి అప్పగించాలని.. మండలాలు, జిల్లా కేంద్రాల్లో మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను గత పాలకులు నిలిపివేశారని.. ఇకపై అలా జరగకుండా చూడాలను ఇప్పటికే ఆదేశించారు సీఎం. వడ్డీలేని రుణాలకు కేంద్ర పథకాలతో లింక్ చేయాలని.. స్త్రీ శక్తికి బీఆర్కే భవన్‌లో ఆఫీసు స్పేస్ ఇవ్వాలన్నారు రేవంత్. నెల నెలా ఉపాధి ఉండేలా కొత్త మార్గాల అన్వేషణ మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. 🌸🚺

bottom of page