top of page
Shiva YT

👤 బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డ సీఎం రేవంత్..

👉 మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. వరుస విచారణలతో ఉచ్చు బిగించే యత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రాజెక్టులు, ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌పై ఇప్పటికే కూపీ లాగుతున్న రేవంత్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. తమ కంటే ముందు పదేళ్లపాటు సాగిన బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన లోపాలను ప్రజల ముందు ఉంచేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి యత్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు కాకుండా విచారణలకే ఆయన మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, తప్పిదాలను ఎత్తి చూపుతూ విచారణలకు సై అంటున్నారు రేవంత్‌. ఇందులో భాగంగానే మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తెప్పించుకున్నారు. 13వ తేదీన అఖిలపక్షంతో మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. కమిషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తి పోస్తోంది. 🚀👥

Comments


bottom of page