top of page

తెలంగాణలో మళ్లీ జల’యుద్ధం’..💧💨

తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార, విపక్షాల మధ్య జల జగడం జరుగుతోంది. కృష్ణా జలాలపై సై అంటే సై అంటున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. ప్రాజెక్టుల అప్పగింత, నీళ్ల కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా బిగ్‌ ఫైట్‌కు సిద్ధం అయ్యాయి.

తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార, విపక్షాల మధ్య జల జగడం జరుగుతోంది. కృష్ణా జలాలపై సై అంటే సై అంటున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. ప్రాజెక్టుల అప్పగింత, నీళ్ల కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా బిగ్‌ ఫైట్‌కు సిద్ధం అయ్యాయి.

ఎస్.! తెలంగాణలో మరోసారి జలయుద్ధానికి సిద్ధం అయ్యాయి అధికార, విపక్షాలు. కృష్ణా జలాలపై కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి. కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ విమర్శిస్తే.. అందుకు బీజం వేసిందే మీరంటూ.. స్వయంగా సీఎం రేవంతే కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్లలో జరగని అన్యాయం.. తెలంగాణకు పదేళ్ల BRS పాలనలో జరిగిందన్నారు రేవంత్. కేసీఆర్ హయాంలోనే.. ఏపీలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు సీఎం రేవంత్. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు శ్రీశైలం చేరకముందే.. తోడుకుపోయేలా ఏపీ సీఎం జగన్ ఎత్తులు వేస్తే.. ఇంటికి పిలిచి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టారన్నారు రేవంత్. కేసీఆర్ ఇంట్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో తయారైందని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింతకు, 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించారని.. వీటిపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సవాల్ విసిరారు రేవంత్.

రేవంత్ సవాల్‌కు స్పందించిన హరీష్‌రావు.. అసెంబ్లీలో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామన్నారు. చర్చకు తాము సిద్ధమని.. కాంగ్రెస్ బండారం అసెంబ్లీలోనే బయటపెడతామన్నారు హరీష్‌. మామ అల్లుళ్లు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్, హరీష్‌రావుపై రేవంత్‌ విమర్శలు చేస్తే.. తెలంగాణకు అన్యాయం చేసే బిల్లు పెట్టిందే.. మీ మామ అంటూ హరీష్‌ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కృష్ణా జలాల వివాదం తెలంగాణలోని అధికార-విపక్షాల అస్త్రంగా మారింది. తప్పు మీదంటే మీదని ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలోనే తేల్చుకుందాం అంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సవాళ్లు చేసుకున్నాయి. ఈ నెల 8 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో.. కృష్ణా నీళ్లపై హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు కృష్ణా ప్రాజెక్టుల వివాదం, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా నదీ జలాలపై రేవంత్‌ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు తప్పుబట్టారు. అలాగే తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలను ఖండించారు.💧💨

bottom of page