top of page

🌀 వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ 🌀

📅 ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ జాగ్రత్తగా వ్యుహలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా విపక్షంలోని కీలక నేతలు పోటీ చేసే కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండటంతో వైసీపీ తరపున కేఆర్‌జే భరత్‌ను బరిలోకి దించాలని నిర్ణయించారు. మొదటినుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్ఠానం.

📈 తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేశ్‌ బరిలోకి దించాలని గంజి చిరంజీవిని నియమించిన జగన్‌ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంవోకు పిలిచి జగన్‌ చర్చించారు. చివరికి లావణ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. కలిసికట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకు రావాలని సూచించారు.

💼 వాస్తవానికి తనను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై తొలుత కినుక వహించి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఆర్కే ఆ తర్వాత వ్యూహం మార్చి మళ్లీ వెనక్కు వచ్చారు. సీఎం జగన్‌ను కలుసుకుని వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవిని కాదని మురుగుడు లావణ్యను అభ్యర్ధిగా ప్రకటించడం జగన్‌ వ్యూహంలో భాగమే.

🔍 జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించాలని జగన్‌ యోచిస్తున్నారు. వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు.

💡 కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పూర్తి ఫోకస్‌తో పనిచేయాలని వైసీపీ కేడర్‌కు సూచించారు జగన్‌. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 🌐

Comments


bottom of page