top of page
Shiva YT

సొంత జాగ ఉన్నవాళ్లందరికీ కేసీఆర్ గుడ్‌న్యూస్..

తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల నిర్వాహణ సందర్భంగా.. సర్కారు చేపట్టబోయే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబీనేట్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. సొంత జాగా ఉన్న వారికి మూడు లక్షల ఆర్థిక సాయం, పోడు భూముల పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమాల ప్రారంభానికి ముహూర్తం ఖారారు చేశారు. జులైలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని.. దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా.. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే ఇచ్చిన హామీల ప్రకారం పథకాల అమలు విషయంలో వేగం పెంచారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సాయం అందించేలా రూపొందించిన గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే జులై నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మార్చిలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లోనే గృహలక్ష్మి పథకం అమలుకు నిర్ణయం తీసుకోగా.. విధివిధానాలు కూడా ప్రకటించారు. ఈ పథకం అమలులో భాగంగా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మొత్తం 3 లక్షల 50 వేల మందికి లబ్ది పొందే అవకాశం ఉంది. లబ్ధిదారులకు 3 లక్షలను 3 దఫాలుగా లక్ష చొప్పున లబ్దిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో 12 వేల కోట్లను సర్కార్ కేటాయించింది.మరోవైపు.. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవనున్నట్టు సీఎం తెలిపారు. అంతేకాదు.. కొత్తగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కాగా.. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు తీసుకోబోతున్న లబ్దిదారులను క్రోడికరించి.. మిగతా రైతులకు అందే పద్ధతిలోనే రైతుబంధు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ తీసి వారి ఖాతాల్లో రైతుబంధును జమచేసేలా చూడాలన్నారు. దీంతో పాటు.. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి.. వారికి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 14న వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. నిమ్స్ హాస్పిటల్ విస్తరణ పనులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

bottom of page