top of page

పాకిస్తాన్‌లో కియా మోటార్స్ డీలర్‌షిప్‌ల మూసివేత..

దాదాపు మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో వాహనాలను విక్రయిస్తున్న కియా.. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో తన ప్రయాణాన్ని ముగించుకోనుంది. దేశంలో ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.

దక్షిణ కొరియా కార్ బ్రాండ్ కియా మోటార్స్ పాకిస్థాన్‌లోని నాలుగు కార్ డీలర్‌షిప్‌లను మూసివేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో వాహనాలను విక్రయిస్తున్న కియా.. అక్కడి దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రయాణాన్ని ముగించుకోనుంది. పాకిస్థాన్‌లో ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. దింతో కియా మోటార్స్ క్వెట్టా, కియా మోటార్స్ చీనాబ్ గుజరాత్, కియా మోటార్స్ అవెన్యూ డేరా ఘాజీ ఖాన్, మోటార్స్ గేట్‌వే మర్దాన్ డీలర్‌షిప్‌లను మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది.

కియా పేరెంట్ సంస్థ హ్యుందాయ్, కాగా కియా పాకిస్థాన్‌లోని 17 నగరాల్లో మొత్తం 31 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కియా మోటార్స్ పాకిస్థాన్‌లో పికాంటో, స్టోనిక్, స్పోర్టేజ్, సోరెంటో అండ్ కార్నివాల్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. కియా 1990 నుంచి పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1994లో నయా దౌర్ మోటార్స్ అనే కంపెనీ పాకిస్తాన్‌లో కియా ప్రైడ్ అండ్ సెడాన్ మోడళ్లను విక్రయించింది. తర్వాత, డిసెంబర్ 1998లో, దేవాన్ ఫరూక్ మోటార్ కంపెనీ లిమిటెడ్ (DFML) హ్యుందాయ్ అండ్ కియాతో కలిసి పాకిస్తాన్‌లో వాహనాలను అసెంబుల్ చేసి విక్రయించింది. 2017లో, కంపెనీ కియా లక్కీ మోటార్ పాకిస్థాన్‌తో జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. 2020లో దీని పేరు లక్కీ మోటార్ కార్పొరేషన్‌గా మార్చబడింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page