top of page
MediaFx

క్లింకార పుట్టిన వేళా విశేషం మెగా ఫ్యామిలీ ఇంట అన్నీ శుభ శకునాలే

మెగా కుటుంబంలో అడుగుపెట్టిన క్లింకార కొణిదెలని అభిమానులు లక్కీ లక్ష్మిగా పిలుస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు గత ఏడాది జూన్ 20న పుట్టిన క్లింకార కుటుంబానికి శుభ శకునాలు తెచ్చిందని భావిస్తున్నారు. ఆమె పుట్టడానికి కొద్దీ రోజుల ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది.

క్లింకార పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు. చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. వీటి వల్ల క్లింకారని మెగా అభిమానులు లక్కీ లక్ష్మిగా అభివర్ణిస్తున్నారు.

క్లింకారను మీడియా, సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలని రామ్ చరణ్, ఉపాసన భావిస్తున్నారు. ఇప్పటివరకు పాప ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోలేదు.

bottom of page