top of page

🔴🎯💬కాంగ్రెస్ లో‘ముఖ్యమంత్రుల’ గోల. రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన వేల.! 🔴🎯💬

కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. ఇక ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం ఆశవాహులు సైతం పెరిగిపోతున్నారు..కర్ణాటక ఫార్ముల తెలంగాణలోనూ ఉపయోగిస్తే తమకు ఎక్కడ సీఎం పదవి దక్కదోనని వారికీ అనుకూలంగా ఉన్న వారిని మా సీఎం అంటూ ఎవరికీ వారు ప్రకటనలు చేసుకుంటున్నారు. గతంలో కలహాలు ఉన్న కాంగ్రెస్ లో కర్ణాటక తరువాత మార్పు వచ్చింది. నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు.గతంలో రెడ్డీ సమాజిక వర్గ నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది.🙂 అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి లే సీఎం అవుతారని కూడా అందరూ భాచించేవారు. రెడ్డీ నేతలతో సీఎం అభ్యర్థుల ఆశవాహ లిస్ట్ సైతం భారీగానే ఉండేది..రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి పలువురు పేర్లు వినిపించేవి. ఇక కెసిఆర్ పై దళిత సీఎం విషయంలో ఎదురు దాడి చేసే కాంగ్రెస్ నేతలు ..తమ ప్రభుత్వం వస్తే దళితులకు పెద్ద పీట వేస్తామని చెప్పేవారు.. అందులో భాగంగా దళితులకు అవకాశం వస్తే సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి అవకాశం ఇవ్వాలని కొంతమంది సీనియర్ నేతలు సైతం బట్టికి బహిరంగంగానే మద్దతు తెలిపారు.. వీటికి కౌంటర్ పాలిటిక్స్ గా రేవంత్ అనూహ్యంగా ఎమ్మెల్యే సీతక్క పేరును తెరమీదకు తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్క సీఎం అవుతుందని ప్రకటించి 😯తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు..

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page