చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను పొగించింది ఏసీబీ కోర్టు. ఈ నెల 19 వరకు పొగిస్తు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మరో వైపు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు కూడా గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా.. పోటాపోటీగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా.. గురువారం కూడా అదే స్థాయిలో ఇద్దరి మధ్య వాదనలు కొనసాగాయి. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్లపై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.