top of page

'చూనా' నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రివ్యూ! 😃📺

సమాజంలో రాజకీయాలు ఎప్పుడూ చురుకైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. 🌍🗳️ రాజకీయాల ముసుగులో అవినీతి, అక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. 💥🚫

తమ అవినీతి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరగడం కోసం చాలా మంది అధికారాన్ని ఆశిస్తారు. అందుకోసం రాజకీయాలలోకి దిగుతుంటారు. 🎯 రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ, ఆర్ధికంగా మరింత బలపడటం కోసం సామాన్య ప్రజల జీవితాలను బలిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఒక వ్యక్తి కథనే 'చూనా'.'చూనా' నెట్ ఫ్లిక్స్ లో క్రితం నెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 📅📺 అవినాశ్ శుక్లా (జిమ్మీ షేర్ గిల్) చాలా చిన్న స్థాయి నుంచి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయికి ఎదుగుతూ వెళతాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం అవినీతి, అక్రమం, మోసం కనుక జాతకాలను, గ్రహదోషాలను, వ్రేళ్లకి ధరించే రంగురాళ్లను ఆయన ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. 🌌🌠 తాను చేసేది మంచి పనులు కాకపోయినా, ముహూర్తం చూసుకోకుండా మాత్రం మొదలుపెట్టడు. అతని వ్యక్తిగత విషయాలను బావమరిది బిష్ణు (చందన్ రాయ్) అస్థానా చూసుకుంటూ ఉంటారు. ఇక ప్రధానమైన అనుచరుడు మదన్ సింగ్ ను దాటి ఎవరూ ఆయన ముందుకు వెళ్లలేరు. శుక్లా తాను ఎదగడం కోసం ఎన్నో నేరాలను చేస్తూ వెళతాడు. వస్తాదుగా మంచి పేరున్న ఫౌలాద్ సింగ్ ను చంపించడం వాటిలో ఒకటి. దాంతో అతని మేనల్లుడైన యాకూబ్ అన్సారీ (ఆషిమ్ గులాటి) శుక్లాపై పగబడతాడు. ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బాంకేలాల్ (త్రిపాఠి) కూడా ఒకానొక సందర్భంలో శుక్లా చేత ఘోరంగా అవమానించబడతాడు. 😠👮 అప్పటి నుంచి అతను పగతో రగిలిపోతుంటాడు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page