top of page

🏢 రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు తరలింపు..

👨‍⚖️ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్రా, సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య వాదనలు కొనసాగాయి. 🗣️ ఇరువర్గాల వాదనలు విన్నతర్వాత కోర్టు సీఐడీ వాదనలు పరిగణలోకి తీసుకుంది కోర్టు. ⚖️

దీంతో చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధించింది కోర్టు. 📅 అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 👥 సీఐడీ సైతం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌‌లో కోరింది. ⚖️ దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ కోర్టు ఆదేశించింది. 🔓 ఆ తర్వాత సీఐడీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచిరాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నారు. 🏃‍♂️ మరో వైపు సెంట్రల్‌ జైలులో ఓ ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లుగా సమాచారం. 🌆 రాజమండ్రి జైలు వద్ద భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు అధికారులు. 🚔 ఇదిలా ఉండగా.. విజయవాడలో భారీ వర్షం కురుస్తున్నది. 🌧️ విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు సుమారు రెండుగంటలకుపైగా సమయం పట్టనున్నది. 🕑

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page