top of page

చిరు కాస్ట్ లీ వాచ్.. దీని ధర తెలిస్తే షాకవ్వాల్సిందే 😳

మెగాస్టార్ చిరంజీవి కాస్త మొన్న మధ్యే పద్మ విభూషణ్ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రకటించిన పురస్కారాల్లోఈయన పేరు రావడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత చిరు.. తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి కాస్త మొన్న మధ్యే పద్మ విభూషణ్ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రకటించిన పురస్కారాల్లోఈయన పేరు రావడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత చిరు.. తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు. మెగాహీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇది. అయితే మెగాస్టార్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆయన చేతి వాచీ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం మీకు గుండె జారిపోద్ది. ఓ సాధారణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజుకు వెళ్లిపోయారు. 150కి పైగా సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే చిరు దగ్గర కార్లు, వాచీల కలెక్షన్ కూడా బాగానే ఉంది. కోట్లాది రూపాయల విలువైనవి ఇందులో ఉన్నాయి. రోలెక్స్ వాచీల దగ్గర నుంచి బెంజ్ కార్లవరకు చిరు దగ్గర ఉన్నాయి. చాలాసార్లు వాటి ఫోటోలు వైరలయ్యాయి.

తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించిన చిరు.. ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటిష్ కంపెనీ చేతి గడియారం తో కనిపించారు. దీని ధర ఎంత అని ఆరా తీస్తే షాకింగ్ నంబర్స్ కనిపించాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటి అనమాట. అదేదో సినిమాలో అన్నట్లు చిరు పెట్టుకున్న ఈ వాచీ అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిలైపోవచ్చు ! 😲

bottom of page