top of page
Suresh D

🌟🏆 మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డు 🏆🌟

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్ ప్రదానం చేసింది. 🌟

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో చిరంజీవిని పద్మవిభూషణ్‌ వరించింది. 🎖️ ఇప్పటికే పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న ఆయన తాజాగా పద్మవిభూషణ్‌ తీసుకోవడంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.  రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ రోజు ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో చిరంజీవికి పద్మవిభూషన్‌ ప్రదానం చేశారు. 🙌 అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మరో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. 🎉

కాగా ఇప్పటికే చిరంజీవి అవార్డుల రారాజుగా పెరుపొందారు. 🌟 సినీ రంగానికి చిరంజీవికి చేసిన సేవలకు గానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్‌ అవార్డు ఇచ్చింది. 🎭 ఇక ఆయన నటించిన స్వయం కృషి, అపద్భాంధవుడు, ఇంద్ర, సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. 🏆

శుభలేఖ, విజేత, స్నేహం కోసం, ముఠామేసస్త్రీ, శంకర్‌ దాదాతో పాటు పలు చిత్రాలకు ఎన్నో ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 🌟 అంతేకాకుండా సౌత్‌ ఫర్‌ హానరరీ లెజెండరీ యాక్టింగ్‌ కెరీర్‌ పేరిట చిరంజీవికి 2006 స్పెషల్‌ అవార్డును ఫిలింఫేర్‌ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. 🌠 ఇక 2010లో ఫిలంఫేర్‌ లైఫ్‌ టై అచీవ్‌మెంట్‌ అవార్డు, తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందిచంఇన సేవలకు గానూ 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. 🎬 తెలుగు ఆంధ్రా యూనివర్సిటీ 2006లో చిరంజీవికి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 🎓 ఇలా చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో అవార్డుల రారాజుగా నిలిచారు. 🌟 ఇక ఆయన తరంలో పద్మవిభూషణ్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా చిరంజీవి నిలిచారు. 🎖️

సేవా కార్యక్రమల్లోనూ నెంబర్ వన్..🌟  

సేవా కార్యక్రమాల్లోనూ మెగాస్టార్ మరో స్టాండర్డ్స్ సెట్ చేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 25ఏళ్లుగా రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరే హీరో చేయని విధంగా తన అభిమానుల్ని సైన్యంగా మలిచారు. వారిలోనూ సేవా స్ఫూర్తి కలిగించారు. చిరంజీవి పిలుపుతో చేసే కార్యక్రమాలే కాదు.. ఆయన స్ఫూర్తితో చేసిన.. చేస్తున్న కార్యక్రమాలెన్నో. ఆ విధంగానూ అభిమానులు చిరంజీవిని ఎప్పుడూ ఉన్నతంగా నిలిపారు. ప్రకృతి విలయాల సందర్భాల్లో చిరంజీవి అందించే సాయం ముందుంటుంది. కరోనా సమయంలో పరిశ్రమను ఏకం చేసి విరాళాలు సేకరించి సినీ కార్మికులకు 4నెలలపాటు నిత్యావసరాలు అందించి.. పెంచిన పరిశ్రమకు విధేయతతో.. పరిశ్రమను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. ఆదరించి పెంచిన ప్రజల కోసం సంజీవనిగా ఆక్సిజన్ బ్యాంకులు సొంత ఖర్చుతో నెలకొల్పారు. 🌟

కొత్తవారిని ప్రోత్సహించే మనసు.. 🤝

తాను ఎలా పరిశ్రమలోకి వచ్చారో నిత్యం గుర్తు చేసుకునే వ్యక్తి చిరంజీవి. మూలాల్ని మర్చిపోకుండా.. కొత్త తరం నటులకు మాట సాయం చేస్తూ సాక్షాత్తూ ఆ చిరంజీవే అభయహస్తం ఇచ్చినట్టు ఇవ్వడం చిరంజీవికి ఉన్న మరో మంచి లక్షణం. కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో చిరంజీవిని మించినవారు లేరు. విమర్శకులను సైతం మెప్పించే సత్తా చిరంజీవికి సొంతం. సినిమాలతో సమాధానం చెప్తారు.. వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు.. ఉన్నత మనస్తత్వంతో మనసుల్లో స్థానం సంపాదిస్తారు. ఇదే దశాబ్దాలుగా చిరంజీవి సాధించింది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. పద్మభూషణ్ అయ్యారు.. పద్మ విభూషణ్ కూడా అయ్యారు. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వానికి.. మేరునగ శిఖరానికి భవిష్యత్తులో.. అతిత్వరలోనే దేశపు అత్యున్నత పౌర పురస్కారం కూడా మణిమకుఠంలా ఆయన కీర్తి కిరీటంలో చేరాలని మనసారా కోరుకుంటున్నాము..🙌

bottom of page