మెగా స్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తనకు క్యాన్సర్ రాలేదంటూ.. క్లియర్ కట్గా చెప్పారు. దాంతో పాటే.. కన్ఫూజన్ క్రియేట్ చేయకండి అంటూ.. మీడియాను రిక్వెస్ట్ చేశారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో.. ఇదే విషయాన్ని సుదీర్ఘంగా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ చిరు ఇంకేం చెప్పారంటే..!
మెగా స్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తనకు క్యాన్సర్ రాలేదంటూ.. క్లియర్ కట్గా చెప్పారు. దాంతో పాటే.. కన్ఫూజన్ క్రియేట్ చేయకండి అంటూ.. మీడియాను రిక్వెస్ట్ చేశారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో.. ఇదే విషయాన్ని సుదీర్ఘంగా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ చిరు ఇంకేం చెప్పారంటే..! “కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే చెప్పాను.