top of page

చిరంజీవి బర్త్‌ డే స్పెషల్‌.. త్రిశూలంతో విశ్వంభర లుక్‌ వైరల్



టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్‌ విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నేడు చిరుకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ విశ్వంభర నుంచి కొత్త పోస్టర్‌ షేర్ చేశారు మేకర్స్‌. అతీత శక్తులతో నిండిపోయిన త్రిశూలాన్ని చేతపట్టుకున్న చిరంజీవి లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ర‌మ్య ప‌సుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే పాపులర్ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌ Anlarasu పర్యవేక్షణలో విశ్వంభరలో వచ్చే హై ఆక్టేన్ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కొనసాగుతున్నట్టు మేకర్స్ తెలియజేశారని తెలిసిందే. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం సెట్స్‌లోకి ఎంటరైన విజువల్స్‌ వీడియోను మేకర్స్‌ షేర్ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తుండ‌గా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన విశ్వంభర టైటిల్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ.. సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది.
















































Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page