top of page

చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కలకలం

పిల్లల కోసం పెద్దలు కొనిపెట్టే ఫేవరెట్ స్నాక్ 'చిప్స్ ప్యాకెట్' ఇప్పుడు అసహ్యం కలిగిస్తుంది. గుజరాత్ జామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. పుష్కర్‌ధామ్ సొసైటీలో నివసించే జాస్మిన్ పటేల్ తన 10 నెలల కుమార్తె కోసం చిప్స్ ప్యాకెట్ కొనుక్కొన్నాడు.

జాస్మిన్ కుమార్తె తన 4 ఏళ్ల బంధువు తో కలిసి గత రాత్రి సగం చిప్స్ తిన్నారు. మిగిలిన ప్యాకెట్ ఉదయాన్నే తెరిచి తింటున్న సమయంలో చనిపోయిన కప్ప కనిపించడంతో దూరంగా విసిరేశారు. తొలుత నమ్మని జాస్మిన్, తనే ప్యాకెట్ పరిశీలించి చూసి హతాశుడయ్యాడు.

జాస్మిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జామ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ప్యాకెట్‌ను పరిశీలించారు. చనిపోయిన కప్పను నిర్ధారించారు. ప్యాకెట్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.

చిప్స్ తయారీదారి స్పందన

ఈ ఘటనపై 'బాలాజీ వేఫర్స్' మేనేజర్ జై సచ్‌దేవ్ మాట్లాడుతూ, తమ వద్ద అలాంటి పొరపాటు జరగదని ఖండించారు. తమ ప్లాంట్‌లో అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నారని, సదరు యంత్రాలు పాడైపోయిన బంగాళాదుంపలను తొలగిస్తాయని తెలిపారు.

సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుక

ఇంకో భయానక ఘటనలో, ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుకను ఒక మహిళ గుర్తించింది. ప్రమీ శ్రీధర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ, కలుషిత సిరప్‌ను ముగ్గురు చిన్నారులు సేవించారని, ఆసుపత్రిలో చికిత్స పొందారని తెలిపారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page