top of page
MediaFx

చైనా సహకారంతో పాకిస్థాన్‌ ఎల్‌వోసీ వద్ద రక్షణ సామర్థ్యాల పెంపు 🚀

పాకిస్థాన్‌కు చైనా సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్‌ తన రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచుకుంటుండగా, చైనా పూర్తి సహకారం అందిస్తోంది. పాకిస్థాన్‌ ఉక్కు బంకర్ల నిర్మాణం, మానవరహిత వైమానిక వాహనాలు, యుద్ధ వైమానిక వాహనాలను మోహరించింది.

చైనా సహకారంతో అధిక ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ టవర్లను నిర్మించడం, భూగర్భంలో ఫైబర్‌ కేబుళ్లు వేయడం జరిగింది. చైనాకు చెందిన అధునాతన రాడార్‌ సిస్టమ్‌లైన ‘జేవై’, ‘హెచ్‌జీఆర్‌’ సిరీస్‌లను పాకిస్థాన్‌ సిద్ధం చేసుకుంది. చైనీస్‌ కంపెనీ తయారు చేసిన 155 ఎంఎం ట్రక్‌-మౌంటెడ్‌ హోవిట్జర్‌ గన్‌ ‘ఎస్‌హెచ్‌-15’లను నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ మోహరించినట్టు గుర్తించారు.

ఈ పరిణామాలతో పాక్‌-చైనా సంబంధాలు మరింత బలపడనున్నాయని, సీపీఈసీ (పాకిస్థాన్‌ చైనా ఎకనామిక్‌ కారిడార్‌)లో చైనా పెట్టుబడులకు మార్గం సుగుమం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.


bottom of page