మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “భోళా శంకర్ “. ఇది తమిళ చిత్రం ‘వేదాలం’ కు రీమేక్ . ఈ రోజు ఈ చిత్రం టీజర్ ను సంధ్య 70 MM థియేటర్ లో ఆ చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.
వందల ఆడియన్స్ నడుమ కేరింతలతో చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ ఈ టీజర్ ను రిలీజ్ చేసారు. మాస్ యుఫొరియాను మరింత పెంచేలా ఉంది టీజర్ . చిరంజీవి మాస్ ప్రెజన్స్ కానీ అయన డైలాగ్ డెలివరీ కానీ అదుర్స్ అనేలా ఉంది . ముఖ్యంగా “ఇస్ స్టేట్ డివైడ్ అయినం , అన్ని ఏరియాలు మనవే నాకు హద్దులు లేవు , సరి హద్దులు లేవు “అన్న డైలాగ్ కి ఆడియన్స్ పిచ్చెక్కి పోయారు . సంధ్య 70 MM పగిలిపోయింది. అలాగే చివర్లో ‘11 ఆగష్టు దేఖ్ లేంగే “ అన్న డైలాగ్ కి 70 MM స్క్రీన్ కూడా మెగాఫ్యాన్స్ ముందు సరిపోదా అనిపించింది. ప్రొడ్యూసర్ రామ్ బ్రహ్మం సుంకర మాట్లాడుతూ టీజర్ ను తలదన్నే విధంగా ఉంటుందని చెప్పారు.