హైదరాబాదీలకు అలెర్ట్. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు.
హైదరాబాదీలకు అలెర్ట్. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు. దీంతో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో చెడ్డీ గ్యాంగ్ ఆగంతకులు కత్తులు పట్టుకుని వీధుల్లో సంచరిస్తున్నారు. నేర్పుగా మాటు వేసి.. అందరూ ఘాడ నిద్రలోకి వెళ్లిన తర్వాత.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను ఆ ప్రాంత ఎస్సై నిర్ధారించారు. మియాపూర్ వసంత విల్లాలో చొరబడ్డ దొంగలు.. 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తచ్చాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు ఈ సీసీ టీవీ ఫుటేజ్ సర్కులేట్ చేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రివేళ్లలో ప్రజలంతా అలెర్ట్‌గా ఉండాలని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. రాత్రివేళలో ఏదైనా అలికిడిగా అనిపించినా, ఎవరైనా డోర్ కొట్టినా.. వెంటనే తెరవద్దని సూచిస్తున్నారు. 💰🚔