🚰🌈 మీ శరీరానికి తగినంత నీరు సరిపోయిందా లేదా అనేది మీ ముత్రం రంగు బట్టి తెలుసుకోవచ్చు. ముదరు పసుపు లేదా కాషాయం రంగులు నిర్జలీకరణాన్ని సూచిస్తాయి. అయితే లేత పసుపు లేదా గడ్డి రంగులు బాగా హైడ్రేట్ శరీరాన్ని సూచిస్తాయి. కాబట్టి మీరు సరైన హైడ్రేషన్ స్థాయిలను స్థిరంగా నిర్వహిస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి రోజంతా మీ మాత్రంపై నిఘా ఉంచండి.
💦💧 మూత్రం ఫ్రీక్వెన్సీ ముఖ్యం: మీరు తరచుగా యూరిన్‌కి వెళ్తూ ఉంటే.. మీ శరీరం హైడ్రేట్‌గా ఉందని చెప్పొచ్చు. మీరు అరుదుగా మూత్రానికి వెళ్తూ ఉంటే.. తగినంత నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.
🌡️🚱 దాహం వేసేంత వరకూ ఎదురు చూడకూడదు: చాలా మంది దాహం వేస్తేనే మంచి నీరు తాగుతారు. అలా కాకుండా.. గంటకు ఒక సారైనా నీటిని తాగుగూ ఉండటాన్ని అలవాటు చేసుకోండి. దీని వల్ల హైడ్రేట్‌గా ఉంటారు.
🌟💦 చర్మం నిర్జీవంగా ఉండటం: మీ శరీరానికి తగినంత నీరు అందుతుందో లేదొ చెప్పేందుకు చర్మం కూడా సహాయ పడుతుంది. మీ చర్మం కాంతి వంతంగా ఉంటే మీరు హైడ్రేట్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మీ చర్మం నిర్జీవంగా, డల్‌గా ఉంటే తగినంత నీరు తాగడం లేదని అనుకోవచ్చు.
🔍🚿 శరీర బరువును ట్రాక్ చేయండి: ఆకస్మిక బరువు మార్పులు కూడా మీ హైడ్రేషన్ స్టాయిల్లో హెచ్చుతగ్గులను సూచిస్తాయి. ఆహారం తీసుకోవడం, వ్యాయామం వంటి కారణాల వల్ల బరువు కొద్దిగా మారడం సాధారణమైనప్పటికీ ఆహారం లేదా కార్యాచరణలో మార్పు లేకుండా స్థిరమైన బరువు తగ్గడం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. అదే విధంగా వేగవంతమైన బరువు పెరగడం కూడా ద్రవం నిలుపుదలని సూచిస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.