top of page

తెలుగులో కనెక్ట్ అయిన ఎమోషన్ కనుక అక్కడ కూడా వర్క్ అవుట్ అయితే..

ఈ సినిమాలో కూడా ఆ సీన్సే కీలకం కానున్నాయి. తెలుగులో కనెక్ట్ అయిన ఎమోషన్ కనుక అక్కడ కూడా వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా విజయం సాధించడం పక్కా..


ప్రభాస్ బ్లాక్ బస్టర్ "ఛ‌త్ర‌ప‌తి" సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వి వి వినాయక్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లకు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మే 12, 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ ట్రైలర్ ను పూర్తిగా యాక్షన్ సీన్స్ తో నింపేశారు. తెలుగు ఛత్రపతిలో హీరో కుటుంబం శ్రీలంక నుంచి ఇండియాకు కాందిశీకులుగా వచ్చినట్లుగా చూపించగా.. హిందీ రీమేక్ లో మాత్రం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చూపించారు. ఈ పాయింట్ తప్పించి మిగతాదంతా యాటజీట్ దింపేసారని చెప్పొచ్చు. తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో ఛత్రపతిని ఎంత స్ట్రాంగ్ గా చూపించారో.. హిందీలోనూ అలాగే చూపించారు. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ బాడీని కూడా బాగా పెంచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ట్రైలర్ క్లియర్ గా కనపడుతోంది.ప్రభాస్ ఛత్రపతిలో ఎమోషనల్ సీన్స్ ఓ రేంజిలో లో ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఆ సీన్సే కీలకం కానున్నాయి. తెలుగులో కనెక్ట్ అయిన ఎమోషన్ కనుక అక్కడ కూడా వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా విజయం సాధించడం పక్కా. హిందీ ఛత్రపతిలో బాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ జానీ లివ‌ర్ (Johny Lever) కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page