top of page
MediaFx

ఇకపై శర్వానంద్ స్టార్ ట్యాగ్ అదే..

మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. తాజాగా హీరో శర్వానంద్ కి మొదటి సారి ఓ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా ఎదిగిన శర్వానంద్, ఎన్నో మంచి సినిమాలను అందించాడు. ఇప్పుడు జూన్ 7న "మనమే" సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు.

శర్వానంద్ కి "ఛార్మింగ్ స్టార్" అని ట్యాగ్ ఇచ్చారు. ఈ టైటిల్ లోగోను స్క్రీన్ పై చూపించారు. ఇకపై శర్వానంద్ సినిమాల్లో పేరుకు ముందు "ఛార్మింగ్ స్టార్" అని రానుంది. దీనిపై శర్వానంద్ స్పందిస్తూ, "మహానుభావుడు" సినిమా టైంలో డైరెక్టర్ మారుతి ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని చెప్పినప్పుడు, నేను వద్దన్నాను. ఇప్పుడు మీరు సర్‌ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్యూ సర్," అని అన్నారు.

ఇకపై శర్వా ఫ్యాన్స్ తమ హీరోని "ఛార్మింగ్ స్టార్" అని పిలుచుకోబోతున్నారు.


bottom of page