top of page

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చుతున్నారా ? 🏰🏞️

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారబోతుందా…? రేవంత్ సర్కార్ పేరు మార్చే దిశగా కొత్తగా ఆలోచన చేస్తుందా..? ఇందులో నిజమెంత? 🤔 గత ప్రభుత్వం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని 1200 కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. 🛕

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. 🏗️ మాజీ సీఎం కేసీఆర్… ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి జీయర్ స్వామి సూచనలు, సలహాలతో 2015లో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తికావడంతో 2022లో ఆలయ ఉద్ఘాటనతో భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. 🕍 ప్రధాన ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే అప్పటి ప్రభుత్వం యాదగిరిగుట్టగా ఉన్న పేరును యాదాద్రిగా మార్చాలని భావించింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ప్రభుత్వ, దేవదాయ శాఖ రికార్డుల్లో కూడా ఎక్కడా యాదాద్రి అని లేదు. యాదగిరిగుట్ట దేవస్థానం అనే ఉంది. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని యాదాద్రిగా పిలవాలని చిన్న జీయర్ స్వామి సూచించడంతో అప్పట్నుంచి ఆలయ పేరు యాదాద్రిగా భక్తులు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది. 🌄 దీనికి తోడు ఇదే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ యాదాద్రిని పాతపేరునే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 🤔✨


bottom of page