top of page
Shiva YT

🌕 జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్‌-3..

🛰చంద్రుడిపై అధ్యయనానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది… కక్ష్య తగ్గింపు ప్రక్రియను శాస్త్రవేత్తలు ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు..

దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతోంది. దీంతో చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్ 3 చేరుకుంటుంది.

🚀జూలై 14న చంద్రయాన్-3ని శ్రీహారికోట స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించింది ఇస్రో. అయితే, చంద్రుడి దగ్గరికి స్పేస్‌క్రాఫ్ట్‌ వెళ్లేందుకు వీలుగా దశలవారీగా కక్ష్యలను తగ్గిస్తున్నారు..ఈ నెల 1వ తేదీన ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నెల 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది స్పేస్‌క్రాఫ్ట్‌..ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ నుండి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టారు..ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుండి వర్టికల్ దిశకు మార్చడం అత్యంత క్లిష్ట ప్రక్రియగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు..ఇక ఈ నెల 23న చుంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విజయవంతంగా అడుగు పెట్టనుంది.



bottom of page