top of page

🚀🛰️ మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్న ఇస్రో..

🌕 చంద్రుడిని తాకిన భారత్ ఇప్పుడు సూర్యుడి వైపు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 విజయం తర్వాత ఇప్పుడు ఆదిత్య L1 కోసం సన్నాహాలు చేస్తున్నారు. 🌞

ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై దిగిన సంబరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. 🔍 ఆ సంబరంలను ఇంకా కొనసాగిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఒక ప్రకటన చేసింది. 🪐 ఇస్రో తన మొదటి సన్ మిషన్‌ను సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. 🌍 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగం జరగనుంది. 🛰️ చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రోకు ఆదిత్య ఎల్1 చాలా ముఖ్యమైనది. ISRO చేపట్టిన మొదటి సన్ మిషన్ పేరులో రెండు పదాలు ఉన్నాయి.. 🌌 మొదటిది- ఆదిత్య .. రెండవది- L1 అంటే లాగ్రాంజ్ పాయింట్. 🌠🛰️ ఆదిత్య L-1 ఎలా పని చేస్తుందంటే ఆదిత్య-ఎల్1లో 7 పేలోడ్‌లు అంటే ప్రత్యేక పరికరాలు ఉంటాయి. 🛰️

ఈ పరికరాలు సూర్యకిరణాలను వివిధ మార్గాల్లో పరీక్షిస్తాయి. ☀️

సౌర తుపానులకు సంబంధించిన లెక్కలు చేస్తాయి. 🪐

ఇందులో హెచ్‌డీ కెమెరాలను కూడా అమర్చనున్నారు. 📸

ఇతర డేటాతో పాటు సూర్యుని, అధిక రిజల్యూషన్ చిత్రాలను పొందుతారు. 📊

ఇస్రో శాస్త్రవేత్తలు ఈ డేటాను తరువాత అధ్యయనం చేస్తారు. 📚

🌕 చంద్రయాన్-3 కింద విక్రమ్ ల్యాండింగ్ చేసిన 10 రోజుల్లోనే ఇంత భారీ మిషన్‌ను ప్రారంభించడం సవాలుతో కూడుకున్న పని, దీని కోసం ఇస్రో సన్నాహాలు పూర్తయ్యాయి. 🌌 ఇస్రో తన సన్ మిషన్ ఆదిత్య L1ని సెప్టెంబర్ 2న ప్రారంభించబోతోంది. 🚀 దాని ఆలోచన 2008లో అందించబడింది. 🗓️


Comments


bottom of page