top of page

🚀🔬 జై విజ్ఞాన్, జై అనుసంధాన్.. ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం.. 💪🔭

🔬 ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి, వారి నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో చాలా సంతోషాన్ని నింపింది.

ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. 💡 ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రునిపై కూడా భారత జెండా రెపరెపలాడుతోంది. ఇస్రో సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణం. 🌍 భారత్ శక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. 🌐 ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించాం. ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. 🛰️ చంద్రయాన్-3 అడుగుపెట్టినటువంటి ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‎గా నామకరణం చేస్తున్నాం. 💫 ఈ చంద్రయాన్ – 3ప్రయోగంలో నారీ శక్తి ఎంతో ఉంది. సృష్టికే ఆధారం నారిశక్తి. భారత్‌ అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తోందని.. ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 🔉 అలాగే ఇప్పుడు ఇస్రో సాధించినటువంటి ఈ విజయం ఎన్నో దేశాలకు స్పూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. 🌟

留言


bottom of page