🔍 ల్యాండర్‌లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ఈ పరికరంలో ఉన్న లేజర్ మట్టిపై పడుతుంది. 🛰️💡🔬🌍
అలా దాన్ని కరిగించడం ద్వారా అందులో ఉన్న రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తించడంలో దోహదపడుతుంది. ల్యాండింగ్ అయిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తిస్తుంది. 🌎🔎🧪 🌞 సోలార్ ప్యానెల్‌ల ద్వారా శక్తిని పొందే విక్రమ్, ప్రగ్యాన్‌లు మరీ అల్పాయుష్షలు.. వీటి జీవితకాలం 14 రోజులే. అందుకే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. 🌞🔆🔌🌒 సూర్యాస్తమయం అయ్యాక- మొత్తం అంధకారంగా మారుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. 🌅❄️🌡️
🚀 అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్, రోవర్ వ్యవస్థలు మనుగడ సాగించలేవు.. 14 రోజుల తర్వాత మళ్లీ అక్కడ సూర్యోదయం అయ్యాక. 🌕🔦🔭🔬 ల్యాండర్, రోవర్‌లపై సూర్యరశ్మి పడి, ఒకవేళ మళ్లీ అవి పనిచేస్తే మరింత ప్రయోజనమేని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 🌍🛰️📡🌖 అయితే 14 రోజుల తర్వాత మళ్లీ అవి పని చేస్తాయని కచ్చితంగా చెప్పలేమంటున్నారు ఇస్రో ఇంజనీర్లు.. 🛰️🔧🔬 ఎనీవే ఇప్పడు ల్యాండర్, రోవర్ చేసే పనులు. భావితరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 🌕🚀🔍