🛰️🌙చంద్రయాన్-3.. చందమామపై అలా అడుగు పెట్టిందోలేదో విక్రమ్ ల్యాండర్ వెంటనే పనిమొదలుపెట్టేసింది! 🌍🛰️
చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. 📸🚀 దక్షిణ ధృవం మొత్తం నాలుగు ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్ చేసింది. విక్రమ్ ల్యాండర్ పంపిన ఫొటోలను మీడియాకి రిలీజ్ చేసింది ఇస్రో. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయ్! 🌐📸 చంద్రుడిపై ల్యాండ్ అవుతున్న సమయంలో 6కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసింది ల్యాండర్. ల్యాండైన తర్వాత కూడా మరికొన్ని చిత్రాలను పంపింది విక్రమ్ ల్యాండర్. ఈ ఫొటోలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. 📸⚫⚪ మొత్తం 14రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది విక్రమ్ ల్యాండర్. 📅🚀