top of page

🌕 చంద్రయాన్-3 భూమికి తిరిగి వస్తుందా? 14 రోజుల తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్‌ల పరిస్థితి ఏమిటి? 🛰️🌍

విక్రమ్, ప్రజ్ఞాన్ భూమికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆ రెండు చంద్రునిపైనే ఉంటాయి. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ చిత్రాన్ని షేర్ చేసింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ తన కెమెరాతో ఈ చిత్రాన్ని తీసింది. 📷

చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సాపేక్షంగా చదునైన ప్రదేశంలో దిగింది. 🌐 చంద్రయాన్-3 మొత్తం బరువు 3,900 కిలోలు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కిలోలు, ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ 26 కిలోల రోవర్ ప్రగ్యాన్‌తో సహా 1,752 కిలోల బరువు కలిగి ఉండటం గమనార్హం. 🚀

ప్రోబ్స్ చంద్ర ఉపరితలం రసాయన కూర్పును పరిశీలిస్తాయి. 👨‍🔬 చంద్రుని నేల, రాళ్లను పరిశోధిస్తుంది. 📡 ఇది ధ్రువ ప్రాంతాల సమీపంలో చంద్ర ఉపరితలంపై అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత, ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ☀️ చంద్రుని దక్షిణ ధృవానికి మరే ఇతర దేశం సాహసం చేయనందున ఇది మన దేశం సాధించిన ఘనతగానే చెప్పాలి. 🌍 రష్యాకు చెందిన లూనా-25 మిషన్ కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. అయితే ఆగస్టు 21నే రష్యాకు చెందిన లూనా-25మిషన్‌ కుప్పకూలింది. 🛸 భారతదేశం ఇస్రో తన రెండవ ప్రయత్నంలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద చంద్రయాన్‌ను విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ చేసింది. 🌌 అంతకుముందు 2019లో చంద్రయాన్-2 మిషన్ క్రాష్ ల్యాండింగ్ అయింది. 💥

Комментарии


bottom of page