🎬 తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. 🌈
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా.. ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. 🎭 నవరసాలను పలికించగలిగిన నాటులను గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శివాజీ గణేశన్, కమల్‌హాసన్‌తో పాటు చంద్రమోహన్ పేరు కూడా తప్పక వినిపిస్తుంది. 🎉 అంతగా పాత్రల్లో మమేకమై నటించారు చంద్రమోహన్. అయితే ఆయనకు అప్పటికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. 🌾 బీఎస్సీ చదువుకున్న ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసేవారు. 🌾 అప్పటికి సమాజంలో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాటకాల వైపు మాత్రం బాగా మొగ్గుచూపేవారు. 🎭 నాటకాలు వేసిన అనుభవంతోనే సినిమా రంగానికి వెళ్లారు చంద్రమోహన్. 👨👦 కొడుకు సినిమాల్లోకి వెళ్లడం చంద్రమోహన్ తల్లికి అసలు ఇష్టం ఉండేది కాదు. 🚃 అయినా తల్లికి సర్ది చెప్పుకుని చెన్నైకి ప్రయాణమయ్యారు. 🏆 రంగులరాట్నం సినిమాల్లో కొడుకుని చూసుకున్నాక తల్లి మనసు కుదుటపడింది. 🌟