top of page

జగన్‌కు ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అడుగుతున్న ప్రతిపక్ష హోదాపై (Opposition status) తొలిసారి చంద్రబాబు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్‌(Jagan) వాదనకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఇస్తే హోదా.. గెలిపిస్తే పదవి వస్తాయని అన్నారు. నేరాలు, బెదిరింపులతో హోదా, పదవులు రావని చంద్రబాబు అన్నారు.

అసెంబ్లీ(Assembly) లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఆ హోదా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని జగన్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో కనీసం 23 సభ్యులుండే పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుందని కూటమి మంత్రులు అసెంబ్లీ సమావేశంలోనే తేల్చి చెప్పారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సైతం స్పందించి 11 సభ్యులు గల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

మొన్నటి ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి 164 సీట్లను కైవసం చేసుకోగా వైసీపీ కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019 -24లో వైసీపీకి 151 స్థానాల్లో విజయం సాధించి ఐదేండ్ల పాటు అధికారంలో కొనసాగింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page