top of page
Shiva YT

టీడీపీ, జనసేన కలిసినా-గెలుపు పై జగన్ ధీమా వెనుక, ఇదీ లెక్క..!!

ఏపీలో ఎన్నికలకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే తన సైన్యాన్ని మోహరించారు. తాజాగా మెగా పల్స్ సర్వే పేరుతో రాష్ట్రంలో ప్రతీ ఇంటికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 16 లక్షల కుటుంబాలు జగన్ కు మద్దతు ప్రకటించాయి. ఇదే ఇప్పుడు సీఎం జగన్ ధైర్యం. చంద్రబాబు- పవన్ కలిసినా ప్రజలు తనతోనే ఉన్నారనేది జగన్ నమ్మకం. అదే ప్రతీ సభలోనూ చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ వ్యూహాత్మ కంగా ఎన్నికల నినాదాలు ఎంపిక చేసింది. ఖచ్చితంగా ఓటర్లను పథకాలు..నినాదాలు ప్రభావితం చేస్తాయని..విజయం అందిస్తాయని నమ్ముతోంది.

హామీల అమలుకు ప్రాధాన్యత : ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచి ఇచ్చిన హామీల అమలుకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. పాదయాత్ర సమయంలో నాటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు..మేనిపెస్టోలో చెప్పిన అంశాలు ఏవీ అమలు చేయని అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసారు. విశ్వసనీయతకు..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెబుతూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ నమ్మకం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డారుద. ముందుగానే పధకాల అమలు క్యాలెండర్ ప్రకటిస్తూ అమలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నాయి. ఇందులో కోటి 16 లక్షల కుటుంబాలకు జగన్ కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. తాజాగా నిర్వహించిన మెగా పల్స్ సర్వేలో ఈ విషయం స్పష్టం అయింది.

బలమైన నినాదాలతో : టీడీపీ, జనసేన పొత్తు రాష్ట్రంలో దాదాపు ఖరారైంది. జగన్ తాను సింగిల్ గానే బరిలోకి దిగుతానని ప్రకటించారు. 2014లో పవన్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించలేదని..ఇప్పుడు తిరిగి కలిసి మరోసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఇంతకు మించి సంక్షేమం అందిస్తామని చెప్పటం మినహా.. ఏం చేస్తారనేది చెప్పటంలో ప్రతిపక్షాలు ఇప్పటి వరకు పై చేయి సాధించలేదు. ఇది జగన్ కు కలిసొచ్చే అంశం. జగన్ ఎన్నికల్లో గెలవకపోతే పథకాలు నిలిచిపోతాయనే ప్రచారం వైసీపీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రతిపక్షాలు సీఎంను విమర్శించే సాహసం చేయటం లేదు. అదే జగన్ కు బలంగా మారుతోంది. సంక్షేమం.. సామాజిక న్యాయం తనకు తిరిగి అధికారం దక్కేలా చేస్తాయనేది సీఎం జగన్ నమ్మకం.



bottom of page