top of page
MediaFx

చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు..

ఆంధ్రప్రదేశ్‎లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తేదీ మార్చారు. జూన్ 9న కాదు, జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కూటమి ఏపీలో భారీ విజయం సాధించింది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8, మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

ముందుగా అమరావతిలో జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో తేదీని మార్చి జూన్ 12న నిర్ణయించారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఇదే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే, నాలుగుసార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు చంద్రబాబు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ ఐదేళ్లు కలిపి మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు.

ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు చూసినా, ఎక్కడ కార్యక్రమం నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ రోజు ప్రాంతంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.


bottom of page