top of page
Shiva YT

🌙 చంద్రబాబుకు తాత్కాలిక ఊరట.. 🏛️ ఆ కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు..

🔍 స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ⚖️

అయితే, స్కిల్‌ స్కామ్‌ కేసుతో పాటు.. 🏢 ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసులు సైతం చంద్రబాబును వెంటాడుతున్నాయి. 🏢🔍 ఈ క్రమంలో పలు కేసుల్లో విచారణ నిమిత్తం సీఐడీ పీటీ వారెంట్‌ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ⚖️ అయితే, చంద్రబాబు సైతం ఈ కేసుల్లో ముందస్తూ బెయిల్ కోరుతూ.. ⚖️🏢 హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ⚖️🏛️ వీటిపై గత కొన్ని రోజులుగా న్యాయస్థానాలలో విచారణలు కొనసాగుతున్నాయి. ⚖️🏛️ఈ క్రమంలో చంద్రబాబుకు ఐఆర్‌ఆర్‌, అంగళ్లు కేసుల్లో తాత్కాలిక ఊరట లభించింది. ⚖️ ఐఆర్‌ఆర్‌ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ⚖️ IRR కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ⚖️అంగళ్లు కేసులో రేపటివరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు పేర్కొంది. ⚖️ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ⚖️ ఈ కేసుల్లో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ.. ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ⚖️🏛️ హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై విచారణను ఏసీబీ కోర్టుల వాయిదా వేసింది. 🏛️ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన రైట్‌ టు ఆడియన్స్‌ పిటిషన్‌ సైతం డిస్మిస్‌ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. 🏛️

అనంతరం .. ఫైబర్‌నెట్‌ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. 🏢🔍 ఇరువైపులా వాదనలను న్యాయాధికారి వింటున్నారు. ⚖️

bottom of page