📜 టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో.. కోర్టులలో పిటిషన్ల ఫైట్ కొనసాగుతునే ఉంది. ⚖️💼 పలు కేసుల్లో.. ఏసీబీ కోర్ట్ నుంచి… సుప్రీం కోర్ట్ వరకు వాదనలు – వాయిదాల పర్వం కొనసాగుతోంది. 📖📚
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో… టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ⚖️📢 అటు.. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ⚖️📆 ఇదిలావుంటే.. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతోపాటు పీటీ వారెంట్‌పై కూడా స్టే ఇవ్వాలంటూ పెట్టుకున్న కేసును కూడా వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకూ ఈ కేసులో బెయిల్ కోసం ఆగాల్సిందే. ⚖️🗓️
👥 స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు 40రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ⏳🏢 మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. 🤒👨⚕️ కుటుంబసభ్యులు సైతం పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 🧐👥 చంద్రబాబును జైలులోనే చంపేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ⚖️🔍