top of page

వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..


చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్నిరూ.15 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. ఆలయాల కల్యాణకట్టలో పని చేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు చేపడుతోంది. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలపైనా ఆలోచనలు చేస్తోంది. దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. మరోవైపు దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పిడులు, అన్యమతస్థుల ప్రచారం చేయకూడదని, భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page