top of page
MediaFx

'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్

తెలుగు నటి చాందిని చౌదరి తన తదుపరి చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'యేవమ్' అనే టైటిల్ ను లాక్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రం నుండి ర్యాప్ సాంగ్ ని విడుదల చేసారు.నటుడు నవదీప్ యొక్క సి స్పేస్ మరియు ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో చాందిని చౌదరితో పాటు అషు రెడ్డి మరియు భరత్ రాజ్ కూడా ముఖ్యమైన పాత్రలలో నటించారు. కీర్తనా శేష్ మరియు నీలేష్ మందలపు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.


bottom of page