top of page

చైతూకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల ఎవరో తెలుసా..?


ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సినిమాలు, నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభంచిన చైతన్య ఆస్తులు ఇప్పటివరకు రూ154 కోట్లు. అలాగే లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభితా ధూళిపాళ నికర విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుంది. శోభిత ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభితా.. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన “రమణ్ రాఘవ్ 2.0″తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే మేజర్ మూవీలోనూ నటించింది. పొన్నియిన్ సెల్వన్, మేడ్ ఇన్ హెవెన్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. శోభితా ధూళిపాళ ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 70 లక్షల నుండి 1 కోటి వరకు వసూలు చేస్తుంది. “పొన్నియిన్ సెల్వన్: ఐ”లో తన పాత్ర కోసం ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. శోభిత నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనల ద్వారా గణనీయంగా సంపాదిస్తుంది.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page