top of page

లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే అంటున్న కేంద్ర మoత్రి నితిన్ గడ్కరీ..

కేంద్ర మoత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే పెట్రోల్ కేవలం రూ. 15కే లభిస్తుందని వెల్లడించారు. రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Petrol Diesel Prices | పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. లీటరుకు రూ. 110 మేర చెల్లించుకోవాల్సిందే. ఇక డీజిల్ రేటు కూడా అదే స్థాయిలో ఉంది. లీటరు డీజిల్ కొనాలంటే రూ. 100 నోటు ఇవ్వాల్సిందే. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తాజాగా పెట్రోల్ డీజిల్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్న ఈయన పెట్రోల్ ధరలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే పెట్రోల్ లీటరుకు రూ. 15కే లభిస్తుందని తెలిపారు.రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక సమావేశంలో నితిన్ గడర్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇక అన్ని వాహనాలు రైతులు ఉత్పత్తి చేస్తున్న ఇథనాల్‌ ఇంధనంపై నడుస్తాయని అన్నారు. 60 శాతం ఇథనాల్, 40 శాతం ఎలక్ట్రిసిటీ సగటు ఆధారంగా చూస్తే అప్పుడు దేశంలో పెట్రోల్ లీటరుకు రూ.15కే లభిస్తుందని ఆయన తెలిపారు.దీని వల్ల ప్రజలకు చాలా బెనిఫిట్ కలుగుతుందని తెలిపారు. అలాగే కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఇంకా దిగుమతుల భారం కూడా దిగి వస్తుందని వెల్లడించారు. దిగుమతుల భారం రూ. 16 లక్షల కోట్లుగా ఉందని, ఇది రైతులకు చేరుతుందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. వారిని అన్నదాతలుగా, ఉర్జాదాతలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాగా ఈయన ప్రతాప్‌గఢ్‌లో 11 నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటి విలువ రూ.5600 కోట్లు.కాగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.64 వద్ద ఉంది. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.8 వద్ద కొనసాగుతోంది.అదే ఏపీలో చూస్తే.. విశాఖ పట్నంలో పెట్రోల్ కొనాలంటే లీటరుకు రూ. 110.46 చెల్లించుకోవాలి. అదే డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 98.25 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రాంతం ప్రాతిపదికన స్వల్పంగా మారుతూ ఉండొచ్చు.చాలా కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంనే ఉంటూ వస్తున్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో ఫ్యూయెల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాటి నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మళ్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యూయెల్ రేట్లు తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page