top of page
Suresh D

ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వాడుకోవచ్చా? 🌀

వేసవి వచ్చింది. ఎండలు మండుతున్నాయి. చాలా మంది ఏసీలు ఆన్ చేయడం మెుదలుపెడతారు. దీనితో ఫ్యాన్ కూడా వేస్తారు. ఇలా వేయడం మంచిదేనా? 🤔

వేసవి కాలం మొదలైంది. అందుకే ఈ సమయంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ని వాడుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కొందరేమో అలానే నడిపిస్తారు. కొందరేమే ఫ్యాన్ ఆపేస్తారు. ఇలా చేయడం వలన లాభం ఉంటుందా? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. 🤷‍♂️

ఏసీ వాడుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేయకూడదని కొందరు అంటుంటారు. ఎందుకంటే అది వేడి గాలిని కిందికి నెట్టివేస్తుందని వివరణ ఇస్తారు. అయితే మీరు సీలింగ్ ఫ్యాన్‌ని ఏసీతో వాడితే గదిలోని గాలి చల్లబడుతుంది. ఇది మొత్తం గదిని చల్లబరుస్తుంది. సీలింగ్ ఫ్యాన్ గదిలోని ప్రతి మూలకు చల్లని గాలిని పంపుతుంది. ఆ సమయంలో ఏసీ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు.

గదిలో కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఇది గదిలోని చల్లని గాలి బయటకు రాకుండా చేస్తుంది. నిజానికి సీలింగ్ ఫ్యాన్‌ను ఏసీతో ఉపయోగించినప్పుడు మీరు సులభంగా విద్యుత్తును ఆదా చేయవచ్చు. అలాగే AC ఉష్ణోగ్రత 24 నుండి 26 మధ్య ఉండాలి. ఫ్యాన్ ఎక్కువ పాయింట్లు పెట్టి.. అది దీనిని మీరు ప్రత్యేకంగా వాడితే 6 యూనిట్లు మాత్రమే కరెంట్ కాలుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ ఖర్చు కూడా ఆదా అవుతుంది.

ఏసీ పాయింట్స్ తగ్గించి.. ఫ్యాన్ కూడా తక్కువలో పెడితే.. గది అంతటా గాలి ప్రసరిస్తుంది, త్వరగా చల్లబరుస్తుంది. దీంతో ఖర్చు తగ్గుతుంది. అయితే మనం 6 గంటల పాటు ఏసీని ఉపయోగించినప్పుడు 12 యూనిట్లు.. అదే సమయంలో ఏసీతో ఫ్యాన్‌ను ఉపయోగిస్తే 6 యూనిట్లు మాత్రమే కరెంట్ కాలుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ ఖర్చు కూడా ఆదా అవుతుంది.

ఏసీ, సీలింగ్ ఫ్యాన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అటువంటి దానిని శుభ్రం చేసేందుకు కచ్చితంగా టిప్స్ పాటించాలి. అప్పుడే ఫ్యాన్ శుభ్రంగా ఉంటుంది. బాగా తిరుగుతుంది. ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అంత తేలికైన పని కాదు. ఎంత శుభ్రం చేసినా దుమ్ము, ధూళి ఉంటుంది. అది కాస్త వెళ్లి ఫ్యాన్ మీద ఉంటుంది. మీరు ఏసీ ఆన్ చేసి సీలింగ్ ఫ్యాన్ పెడితే దానిపై ఉన్న దుమ్ము గదిలో వ్యాపిస్తుంది.

ఫ్యాన్‌ను కచ్చితంగా శుభ్రం చేయాలి. లేదంటే దుమ్ము పేరుకుపోయి ఇబ్బందులు వస్తాయి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దానిపై ఉన్న చిన్న దుమ్ము రేణువులు మనలోకి వెళ్లే అవకాశం ఉంది. ఫ్యాన్, ఏసీని కచ్చితంగా శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే సమస్యలు తలెత్తుతాయి. 😊🌬

Comments


bottom of page