top of page

🚫 కూల్ డ్రింక్స్‌తో క్యాన్సర్ ముప్పు’..స్పష్టం చేసిన WHO🌍

🥤శీతల పానీయాల్లో వినియోగించే అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గురువారం (జులై 13) ప్రకటించింది.📢

ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు కూల్‌ డ్రింక్స్‌, తక్కువ చక్కెర కలిగిన ఆహారాల్లో ‘అస్పర్టమే’ విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ☕🍵 ఐతే కాఫీ, టీలలో వినియోగించే అస్పర్టమే ట్యాబ్లెట్స్‌ అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. 🚫 ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరంగా స్థూలకాయం అత్యధికంగా పెరుగడంపై ఇటీవల పరిశోధనలు జరిగాయి. 🧪 పానీయాల్లో వినియోగించే అస్పర్టమే కృత్రిమ తీపి ‘హెపాటోసెల్లర్ కార్సినోమా’ అని పిలవబడే కాలేయ క్యాన్సర్‌కు కారణం అవుతుందని అధ్యయనాల్లో బయటపడింది. 📚 ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (IARC), డబ్ల్యూహెచ్‌ఓ (WHO), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), జాయింట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్ (JECFA) 👥 ఉమ్మడిగా ఇందుకు సంబంధించిన వివరణాత్మక అధ్యయన నివేదికను విడుదల చేశాయి. 👩‍🔬 అస్పర్టమే అనేది అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో తయారు చేసిన కృత్రిమ తీపి. 1️⃣9️⃣8️⃣0️⃣ నుంచి డైట్ డ్రింక్స్‌, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పాలు-పెరుగు ఉత్పత్తులు, టూత్‌పేస్ట్, దగ్గు సిరప్‌, చూయింగ్‌ గమ్‌ వంటి పలు ఆహారాలు, శీతల పానీయాల ఉత్పత్తుల్లో కృత్రిమ (రసాయన) స్వీటెనర్ ఉపయోగిస్తున్నారు.🥤

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page