top of page

💰 డెడ్‌ లైన్‌ తర్వాత రూ.2000 నోటును మార్చలేమా..?

🤔 మీ దగ్గర ఇంకా 2000 నోట్లు ఉండిపోయాయా. నేటితో ఈ నోట్లు మార్చుకునే గడువు పూర్తియిపోతోంది. 💸 మరి మిగిలి ఉన్న నోట్లను మార్చుకోవడం ఎలా? 🤷‍♂️

కంగారు పడకండి.. ఈ విషయమై ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. 📢 2000 నోట్ల మార్పిడికి సంబంధించి అక్టోబరు 7 వరకు పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. 🗓️ అయితే గడువు ముగిసిన తర్వాత కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. 🏦 ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 🧾 ఈ ఏడాది మే 19న 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించే సమయానికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. 💡 ఇందులో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయన్నారు. 2 వేలు నోట్ల మార్పిడి గడువును తొలుత సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. 📅 అయితే 8వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. 🏦📄


Hozzászólások


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page